Nara Lokesh Alleges: పునర్విభజన బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లులను అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశాయని మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా ఆరోపించారు.

ఇప్పటివరకు ఆర్టికల్‌ 81 ప్రకారం రాష్ట్రాల మధ్య స్థానాల పంపిణీ ఫ్రీజ్‌లో ఉండేదని లోకేశ్‌ వివరించారు. ఈ బిల్లులు అమలు కాకపోతే 2026 జనాభా గణన తర్వాత కేవలం జనాభా ఆధారంగానే స్థానాలు నిర్ణయించబడతాయన్నారు. దీంతో అభివృద్ధి పనుల్లో మంచి పనితీరు చూపిన రాష్ట్రాలు తీవ్ర నష్టపోతాయని ఆయన హెచ్చరించారు.

ఇది ఫెడరల్‌ సమతుల్యతపై నేరుగా దాడి చేసినట్లేనని, ఈ నష్టం మొత్తం ప్రతిపక్ష పార్టీల వల్లనే జరిగిందని లోకేశ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Next Story