Nara Lokesh: జెన్‌జీ (జనరేషన్‌ జీ) యువతతో నిరంతరం మమేకమై వారి ఆశయాలు, ఆకాంక్షలు, సమస్యలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. యువత అభిప్రాయాల ఆధారంగా వారికి ప్రయోజనం చేకూర్చేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.

నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘జెన్‌జీ యువతతో మాటామంతి’ (మీట్ అండ్ గ్రీట్ విత్ జెన్‌జీ) కార్యక్రమంపై మంత్రి లోకేశ్ సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా అభినందనలు తెలిపారు. “ఈ జెన్‌జీ వేదిక అద్భుతమైన చొరవ. యువత ఆకాంక్షలను అర్థం చేసుకుని వారికి మేలు చేసే కార్యక్రమాలు రూపొందించేందుకు వారితో నిరంతరం సంప్రదింపులు జరపాలి. ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన భావ వినిమయం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని లోకేశ్ ట్వీట్ చేశారు.

మంత్రి లోకేశ్ దార్శనికతతో ప్రేరణ పొంది తర్వాతి తరం ఆలోచనలు, ఆశయాలు, అంచనాలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. యువతతో మాట్లాడి, వారి నుంచి నేర్చుకుని మెరుగైన భవిష్యత్తు నిర్మించుకుందామని కూడా అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా యువతతో నేరుగా సంభాషించి వారి అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాల్లో చేర్చుకోవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఈ చొరవను చేపట్టారు.

Next Story