✕
Nara Lokesh: ప్రతి గ్రామంలో తెలుగుదేశం జెండా ఎగరాలి: నారా లోకేశ్
By PolitEnt MediaPublished on
తెలుగుదేశం జెండా ఎగరాలి: నారా లోకేశ్

x
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 29న అన్ని చోట్ల పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం జెండా ఎగరవేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
క్యాబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో నారా లోకేశ్ విడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలను సన్మానించి, వారితో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు భోజనం చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి లోకేశ్ సూచించారు.
పార్టీ బలోపేతం కోసం అన్ని స్థాయిల్లోనూ సమన్వయంతో పని చేయాలని ఈ సమావేశంలో లోకేశ్ మంత్రులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.
Next Story

