Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా, శ్రీసిటీలో క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ తయారీ కేంద్రానికి రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.

ఈ ప్రాజెక్టులో సుమారు రూ.1000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 3000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి లోకేశ్, ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలకు అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా ఆధునిక కూలింగ్ టెక్నాలజీ రంగంలో క్యారియర్ వంటి గ్లోబల్ సంస్థల పెట్టుబడులు రాష్ట్రానికి పెద్ద బలమని పేర్కొన్నారు.

శ్రీసిటీలో ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఈ కొత్త యూనిట్‌తో ప్రాంతం మరింతగా ఏసీ తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు రాష్ట్ర తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story