AP Cabinet Decisions: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో పోలీసు పాలనను మరింత సమర్థవంతం చేసేందుకు నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్లు ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా ఈ కమిషనరేట్లు ఏర్పాటు కానున్నాయి.

రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1,548 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. అమరావతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులకు అదనంగా రూ.644.98 కోట్లు, అసెంబ్లీ భవనంలో స్పైర్‌, రూఫ్‌, లిఫ్ట్‌ పనులకు రూ.661 కోట్లు మంజూరు చేశారు.

ఎల్‌పీఎస్‌ రైతులకు కనీస యాన్యుటీ చెల్లింపు కోసం నిబంధనల సవరణకు కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో పరిపాలనా సామర్థ్యం, రాజధాని అభివృద్ధి, రైతుల సంక్షేమం మరింత బలపడనున్నాయి.

Next Story