Nara Lokesh: మున్సిపాలిటీల్లో 22,800కు పైగా నామినేషన్లు.. స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతున్నాయని మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్నాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో 22,800కు పైగా నామినేషన్లు దాఖలు కావడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.
అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం నుంచి అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడటానికి ముందుకు వచ్చారని లోకేశ్ తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడం వల్ల ఎన్నికలు పూర్తి పోటీతో, ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక్క ఓటు కూడా పడకముందే ఎన్నికలపై ఆరోపణలు చేసేవారు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి హితవు పలికారు. ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది మీడియా సమావేశాలు కావని, ప్రజాక్షేత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇది పరోక్షంగా వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కౌంటర్‌గా నిలిచింది.
ప్రజల వద్దకు వెళ్లాలని, అంతిమంగా ప్రజలే తీర్పు ఇస్తారని నారా లోకేశ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన మలుపు తీసుకురాగలవని ఆయన అన్నారు.

