Pawan Kalyan Congratulates Chandrababu: పవన్ అభినందనలు: చంద్రబాబుకు అవార్డు రాష్ట్రానికే గౌరవం
చంద్రబాబుకు అవార్డు రాష్ట్రానికే గౌరవం

Pawan Kalyan Congratulates Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎకనమిక్ టైమ్స్ సంస్థ నుంచి ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రకటించడం అత్యంత ఆనందదాయకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“చంద్రబాబు గారి నాయకత్వ శైలి అందరికీ స్ఫూర్తిదాయకం. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం ఆయన అమలు చేస్తున్న పరిపాలనా విధానాలు, పరిశ్రమల వృద్ధికి చేపట్టిన సంస్కరణలు ఖచ్చితంగా శుభఫలితాలను ఇస్తాయి. ఈ పురస్కారం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు మరింత బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది” అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల వాతావరణం సృష్టించడం, పరిశ్రమల సంస్కరణలు, భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో చూపిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. మార్చి నెలలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
ఈ అవార్డు ప్రకటనతో మంత్రులు, అధికారుల నుంచి చంద్రబాబుకు అభినందనలు క్యూకట్టాయి. తనకు ఈ గౌరవం లభించడం వెనుక మంత్రివర్గ సహచరులు, అధికారులు, కలెక్టర్ల సామూహిక కృషి ఉందని చంద్రబాబు స్పందించారు.

