CM Chandrababu: పవన్, అణువణువునా సామాజిక స్పృహ కలిగిన నాయకుడు : CM చంద్రబాబు
సామాజిక స్పృహ కలిగిన నాయకుడు : CM చంద్రబాబు

CM Chandrababu: జనసేన అధినేత , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు IT, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు 'ఎక్స్' వేదికగా తెలిపారు. "పవన్ ది అడుగడుగునా సామాన్యుడి పక్షం... అణువణువునా సామాజిక స్పృహ .. మాటల్లో పదును.. చేతల్లో చేవ... మాటకు కట్టుబడే తత్త్వం .. జన సైన్యానికి ధైర్యం ... రాజకీయాలలో విలువలకు పట్టం .. అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలి .. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి . పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ సహకారం మరువలేనిది" అని తెలిపారు.
పవన్ జన నాయకుడిగా ఎదిగారు : నారా లోకేష్
" వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు" అని లోకేష్ అన్నారు.
