AP Minister Savita : అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టీకరణ

- పెన్షన్లపై వైసీపీది అనవసర రాద్ధాంతం
- పార్టీని బతికించుకోడానికి వైసీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం
అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించే ప్రసక్తే లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందేలా పాలన సాగిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మంటపాలకు ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నామన్నారు. ప్రజాభీష్టం మేరకు సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించడంలేదని మంత్రి సవిత తెలిపారు. వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, పార్టీని బతికించుకోడానికి ఆ పార్టీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కూడా అందజేయనున్నామని, ఇప్పటికే రేషన్ కార్డులు అందజేశామని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, నియోజక వర్గంలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సవిత తెలిపారు. రొద్దం మండలంలో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించామన్నారు. రూ.2 కోట్లతో పీహెచ్సీ భవనాన్ని నిర్మించబోతున్నామన్నారు. తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపడుతున్నామని, రెండు తాగునీటి బోర్లు కూడా మంజూరు చేశామని వెల్లడించారు. మండల కేంద్రంలో బీసీ కమ్యూనిటీ హాల్, అదనంగా మరో బీసీ హాస్టల్ ను కూడా నిర్మింబచోతున్నట్లు తెలిపారు. త్వరలో కందుకూరు పల్లి నుంచి చెనుకొండపల్లి రహదారి నిర్మించబోతున్నామన్నారు. ఇందుకు సంబంధించి భూమి పూజ కూడా త్వరలో చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అంతకుముందు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి సవితకు పి.రొప్పాల గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
