ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి డిమాండ్‌

నా తండ్రి ఆరోగ్య పరిస్ధితిపై వైద్యలు ఎందుకు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయడం లేదని ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి ప్రశ్నించారు. కాకినాడ మెడికోవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి పరామర్శించారు. ముద్రగడను కలసి ఆసుపత్రికి వెలుపలికి వచ్చిన క్రాంతి తన తండ్రి పరిస్ధితి తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మా నాన్నకు సరైన వైద్యం అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు వైద్యం ఏం చేస్తున్నారో బహిర్గతం చెయ్యడం లేదని, అంత రహస్యంగా వైద్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ముద్రగడ కుమార్తె క్రాంతి ప్రశ్నించారు. మానాన్నకు క్యాన్సర్‌ ఉందని ఈ విషయాన్ని తాను రెండు నెలల క్రితమే చెప్పానని గుర్తు చేశారు. మా నాన్నకు క్యాన్సర్‌ చికిత్స చేయకుండా డయాలసిస్‌ చేస్తే ఉపయోగం ఏంటని క్రాంతి అన్నారు. మా నాన్నతో నేను మాట్లాడకుండా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని నేను వెళ్ళినప్పుడు ఆయన నా చేయి పట్టకున్నారని ముద్రగడ కుమార్తె క్రాంతి తెలిపారు. మానాన్న ముద్రగడని కాకినాడలో మూడు హాస్పిటల్స్‌ తిప్పారని, హైదరాబాద్‌ తీసుకు వెళ్లి ఎందుకు చికిత్స చేయించడం లేదని క్రాంతి ప్రశ్నించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story