Minister Nimmala Ramanaidu: దేశ ఇరిగేషన్ రంగంలో ప్రఖ్యాత ఇంజినీర్ డాక్టర్ కె.ఎల్. రావు సేవలు చిరస్మరణీయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కె.ఎల్. రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నిమ్మల రామానాయుడు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, ఈఎన్‌సీలు నరసింహమూర్తి, వరప్రసాద్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, “హిరాకుడ్, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల రూపకల్పనలో డాక్టర్ కె.ఎల్. రావు ప్రధాన పాత్ర పోషించారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానం అవసరాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆ ఆలోచనను నాడు అటల్ బిహారీ వాజ్‌పేయీ, నేడు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు” అని తెలిపారు.

“పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి, పుష్కరాల నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించి రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తాం” అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.

Next Story