CM Chandrababu: పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం: సీఎం చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం బహుళప్రయోజన ఇరిగేషన్ ప్రాజెక్టును సోమవారం సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
హెలికాప్టర్ ద్వారా విహంగ వీక్షణం చేసిన సీఎం, ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఎగువ-దిగువ కాఫర్‌డ్యామ్‌ల మధ్య జరుగుతున్న పనులు, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం వంటి కీలక అంశాలను సీఎం దగ్గరగా పరిశీలించారు.
అనంతరం ప్రాజెక్టు సైట్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను చూశారు. ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ సందర్శనలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు సీఎంతో ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్ర వ్యవసాయ రంగానికి, గోదావరి డెల్టా ప్రాంతాలకు ఎంతో మేలు చేస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.

