హైకోర్టు అనుమతి తీసుకుని తాడిప్రతి వెళ్ళే ప్రయత్నం చేసిన పెద్దారెడ్డి

తాడిపత్రి మాజీ శాసనసభ్యడు కేతిరెడ్డి పెద్దారెడ్డి న్యాయస్ధానం ఆదేశాలతో నేడు పట్టణానికి వెళ్ళే ప్రయత్నం చేయడంతో మరోసారి ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. హైకోర్టు ఆదేశాల మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రికి వెళ్ళారు. అయితే పోలీసులు అయన్ను నారాయణపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు దీంతో తాడిపత్రి పట్టణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రి వెళ్లడానికి తనకు హైకోర్టు అనుమతి ఉందని ఆదేశాలు చూపించినా పోలీసులు ఆయన్ను పట్టణంలోకి అనుమతించ లేదు. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లవచ్చని హైకోర్టు ఆదేశాలు ఉండటంతో కేవలం కాలయాపన చేయడానికే తనను అడ్డకుంటున్నారని పోలీసుల తీరుపై పెద్దారెడ్డి మండిపడ్డారు. పోలీసులు జేసీప్రభాకర్‌రెడ్డి ఆదేశాలు అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది ప్రభుత్వామా జేసీనా అని పెద్దరెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారని, ఈ విషయంపై మరో సారి హైకోర్టును ఆశ్రయిస్తానని పెద్దరెడ్డి స్పష్టం చేశారు. 14 మాసాల తరువాత హైకోర్టు అనుమతితో పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు పెద్దారెడ్డికి భద్రత కల్పించాల్సి ఉండగా తాము భద్రత కల్పించలేమని, మీరు తాడిపత్రిలో అడుగు పెడితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే పరిస్ధితి ఉందని పోలీసులు చేతులెత్తేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story