విచారణకు హాజరైన సీనియర్ ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్

Raghurama Krishnam Raju Custodial Torture Case: గత వైకాపా ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, సోమవారం గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కొల్లు రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో హింసించిన కేసులో సునీల్ కుమార్ ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్నారు.

విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. గత నెల 26న మొదటి నోటీసు జారీ చేసి డిసెంబరు 4న హాజరు కావాలని సూచించగా, కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా గడువు కోరిన సునీల్ కుమార్‌కు డిసెంబరు 6న రెండో నోటీసు ఇచ్చారు. దీంతో డిసెంబరు 15న ఆయన విచారణకు హాజరయ్యారు.

ఈ కేసు గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విచారణ ప్రక్రియ కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story