Nirmala Sitharaman: రాయలసీమలో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ ఉద్యాన (హార్టికల్చర్‌) హబ్‌కు శంకుస్థాపన చేస్తూ ఆమె ప్రసంగించారు.

రూ.లక్ష కోట్లతో రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపిన నిర్మలా సీతారామన్‌, ‘‘రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం’’ అని స్పష్టం చేశారు. యూరియా కొరత లేకుండా అనేక చర్యలు చేపడుతున్నామని, యూరియా ఒక్కో బ్యాగ్‌కు రూ.300 కంటే ఎక్కువ తీసుకోవద్దని గట్టి ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.

గ్రామాల్లో గోబర్ధన్‌ స్కీమ్‌ ద్వారా బయోగ్యాస్‌ ఉత్పాదన వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సూర్యఘర్‌ యోజన, పీఎం కుసుమ్‌ యోజన ద్వారా సోలార్‌ పంపులు అందిస్తూ ఉచిత విద్యుత్‌ పంపిణీకి ఏర్పాట్లు చేశామని చెప్పారు. పంట నష్టం నుంచి రైతులను రక్షించేందుకు కిసాన్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను తీసుకొచ్చామని, కిసాన్‌ క్రెడిట్‌ ద్వారా పంటకు అవసరమైన నిధులు అందుతున్నాయని తెలిపారు.

మత్స్యకారులు, పశుపోషకులకు కొత్త పథకాలు ప్రవేశపెట్టామని, ప్రతి జిల్లాలో జంతు సంరక్షణ కోసం వెటర్నరీ డాక్టర్‌తో పాటు మొబైల్‌ యానిమల్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

ఈ కార్యక్రమం రాయలసీమ రైతాంగానికి కొత్త ఆశలు కలిగించింది.

Next Story