కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు భారీగా చేరుతోంది – విపత్తు నిర్వహిణ సంస్ధ

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రకు ఆరెంజ్‌ అరెస్ట్‌ జారీ చేయడంతో ఎక్కడికక్కడ అధికారులంతా సహాయ చర్యలకు సిద్దంగా ఉండాలని మంత్రి రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు. ఆత్తరాంధ్ర, ఆల్లూరి సీతారామరాజుమన్యం, ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు చెపపారు. అలాగే ప్రకాశం బ్యారేజి నుంచి సుమారు 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వచ్చే పరిస్ధితి ఉండటంతో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, అవసరమైన మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ మంత్రి ఆదేశించారు. అప్పపీడనం నేపథ్యంలో కోస్తాఆంధ్ర ప్రాంతంలో మత్యకారులు ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సూచించారు. ఎటువంటి వరద విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి , ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దంగా ఉందని మంత్రి అనగాని స్యతప్రసాద్‌ ధైర్యం చెప్పారు.

మరోవైపు విపత్తు నిర్వహణ సంస్ధ వివిద డ్యామ్‌లలో వరద ప్రవాహం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను ప్రకటించింది. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్‌ఫ్లో 3.06లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులు ఉందని, అలాగే నాగార్జున సాగర్‌ వద్ద ఇన్‌ఫ్లో 2.69 లక్షలు ఉండగా ఔట్‌ఫ్లో3.17 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్ధ ఎండీ ప్రఖర్‌ జైన్‌ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇక పులిచింతల వద్ద ఇన్‌ఫ్లో 3.12 లక్షలు ఉండగా ఔట్‌ఫ్లో 3.72 లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలు రెండూ 3.93 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం మీద కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతోందని ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వినాయ నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఇదేసమయంలో గోదావరి నదిలో కూడా నీటి ప్రవాహం స్వల్పంగా పెరుగుతోందని విపత్తు నిర్వహణ సంస్ధ పేర్కొంది. భద్రాచలం వద్ద 37.70 అడుగుల నీటిమట్టం ఉండగా, కూనవరం వద్ద 15.78 మీటర్లు, పోలవరం వద్ద 10.16 మీటర్లు, ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.13లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు విప్తు నిర్వహణ సంస్ధ ఎండీ ప్రఖర్‌ జైన్‌ ప్రకటించారు. గోదవరి పరివాహకంలో రేపటి మొదటి ప్రమాద హెచ్చరిక స్ధాయికి వరద నీరు చేసే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎవ్వరూ వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రఖర్‌ జైన్‌ హెచ్చరించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story