Sai Krishna's Mother: విజయవాడకు చెందిన యువకుడు సాయికృష్ణ మృతి వ్యవహారంలో అతని తల్లి విజయలక్ష్మి తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. కాళ్లపై మేకులు కొట్టి సీఐ నాగరాజు తన కుమారుడిని దారుణంగా హింసించి చంపాడని ఆమె ఆరోపించారు.

సాయికృష్ణ మృతి కేసుపై మెజిస్టీరియల్ విచారణలో విజయలక్ష్మి తన వాదనలు వినిపించారు. సబ్ కలెక్టర్ ముందు ఆమె తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

తన కుమారుడి బూడిదను వెంటనే అందించాలని, లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని విజయలక్ష్మి హెచ్చరించారు. ఈ కేసులో కొందరిని అరెస్టు చేసినా మిగతా నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న బూడిద, ఎముకలు తన కుమారుడివేనని ఎలా నమ్మాలని, ఇలాంటి హత్యలు ఇంతకు ముందు ఎన్ని జరిగాయో తెలియదని ఆమె మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ప్రతిస్పందన కలిగించింది. పోలీసు అధికారులపై తీవ్ర ఆరోపణలు ఉండటంతో విచారణ మరింతగా ముందుకు సాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story