మానవసేవే మాధవసేవగా ఆచరించిన మహనీయుడు: సీఎం చంద్రబాబు

CM చంద్రబాబు about Sathya Sai- A Divine Presence on Earth: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి మహోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, ఆయనను భూమిపై మనం చూసిన దైవ స్వరూపంగా కొనియాడారు. విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే సత్యసాయి మార్గమని, మానవసేవే మాధవసేఐဤని నమ్మి ఆచరించిన మహనీయుడు ఆయన అని పేర్కొన్నారు.

బుధవారం ప్రశాంతి నిలయంలో జరిగిన శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో మాట్లాడిన చంద్రబాబు... ‘‘ప్రపంచమంతా ప్రేమను పంచిన మహాత్ముడు సత్యసాయి. విదేశాలకు వెళితే చాలామంది ఆయన గురించి గొప్పగా చెప్పేవారు. 1600 గ్రామాలకు 30 లక్షల మందికి తాగునీరు అందించారు. 102 విద్యాలయాలు, ఎన్నో ఆసుపత్రులు స్థాపించారు. 140 దేశాల్లో 200 కేంద్రాల ద్వారా సేవలందిస్తున్న సత్యసాయి ట్రస్ట్‌కు 7 లక్షలకు పైగా వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వాల కంటే ముందుగా, వేగంగా స్పందించి సేవ చేసేవారు బాబా. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకుని, ఆ మార్గంలో నడవాలి’’ అని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ప్రపంచానికి వెలుగు నిచ్చిన అరుదైన ఆధ్యాత్మిక శక్తి సత్యసాయి అని అన్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఆయన జన్మించడం ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుందని, సామాన్యులకు తాగునీరు అందించేందుకు జల్‌జీవన్ మిషన్ లాంటి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. సచిన్ టెండుల్కర్‌తోపాటు ఎందరో ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు కూడా బాబా ప్రభావానికి లోనయ్యారని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామని పవన్ హామీ ఇచ్చారు.

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... పేదలకు ప్రేమతో సాయం అందించాలన్న సత్యసాయి బోధనలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన బాబా సేవతో ప్రజలకు దేవుడయ్యారని, ప్రశాంతి నిలయం నిజమైన ప్రశాంతతకు ఆలవాలమని లోకేశ్ అన్నారు.

ప్రధాని మోదీ, సచిన్ టెండుల్కర్ తదితర ప్రముఖులు ఈ మహోత్సవాల్లో పాల్గొనడం విశేషం. సత్యసాయి సందేశం యావత్ ప్రపంచానికీ వ్యాపించాలని అందరూ ఆకాంక్షించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story