SatyakumarYadav: జగన్ ఫోటోతో విజయ్ గెలిచాడనడం హాస్యాస్పదం: మంత్రి సత్యకుమార్ యాదవ్
మంత్రి సత్యకుమార్ యాదవ్

SatyakumarYadav: టీవీకే అధినేత విజయ్‌ను గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం సరికాదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గవర్నర్ రాజ్యాంగం ప్రకారమే వ్యవహరిస్తారని, ఎలాంటి అనవసర విమర్శలు చేయకూడదని అన్నారు.
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న ప్రచారాలను తీవ్రంగా విమర్శించారు. ‘‘జగన్ ఫోటోతో విజయ్ గెలిచాడని వైకాపా నాయకులు చేస్తున్న ప్రచారం హాస్యాస్పదం. మాజీ మంత్రి రోజా డీఎంకే తరఫున ప్రచారం చేశారు. కానీ ఆ పార్టీ ఓడిపోయింది. ఏపీ ప్రజలు వైకాపాను తిరస్కరించి 11 సీట్లకు పరిమితం చేశారు. బార్డర్ దాటితే జగన్‌ను ఎవరైనా గుర్తుపడతారా?’’ అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా రాజకీయ ప్రమాణాలు, గవర్నర్ పాత్రపై రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.

