Annamayya District : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీ బోల్తాపడి 9 మంది మృతి. 13 మందికి గాయాలు

అన్నమయ్య జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై మామిడి లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడటంతో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగుర మహిళలు ఉండగా నలుగురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది తీవ్రంగా గయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 22 మంది కూలీలు ఐషర్ వాహనంపై రాజంపేట జిల్లా ఇసుకపల్లి గ్రామానికి మామిడికాయల లోడుతో వెళ్ళారు. లారీ రెడ్డిపల్లి వద్ద చెరువుకట్టపై ఒక మలుపు వద్ద ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలు మృత్యువాత పడగా గాయపడ్డ 13 మందిని 108 అంబులెన్సుల్లో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా. ప్రమాద స్ధలాన్ని ఎస్పీ రామ్ నాథ్ కార్గే సందర్శించారు.
అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెంది, 13 మంది క్షతగాత్రులైన దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డిలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్.జగన్, ఏపీ బీజేపీ అధ్యక్షులు పీఎన్‌వీ మాధవ్‌లు ప్రభుత్వాన్ని కోరారు.
