✕
రాజ్యసభ సీటు కోసమా?

x
Sharmila: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం భేటీ అయ్యారు. దిల్లీలోని ఈ ముఖ్య సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.
షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రచారం జరుగుతోంది. త్వరలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీ అనంతరం షర్మిల తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, వివిధ అంశాలపై రాహుల్ గాంధీ పలు సూచనలు చేశారని తెలిపారు.

PolitEnt Media
Next Story
