సామాజిక బాధ్యతను పునరుద్ధరిస్తున్నాయి: మంత్రి నిమ్మల

Minister Nimmala: లఘు చిత్రాలు సమాజంలో చైతన్యాన్ని కలిగించి, సామాజిక రుగ్మతలను తొలగించడానికి ఒక వేదికగా నిలుస్తున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇవి సామాజిక బాధ్యతను గుర్తు చేయడంతో పాటు వినోదాన్ని అందిస్తున్నాయని తెలిపారు. పాలకొల్లులో జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ లఘు చలనచిత్ర పోటీల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

‘‘లఘు చిత్రాలు తక్కువ నిడివితో ఉన్నప్పటికీ సమాజానికి గొప్ప సందేశాలను అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల రాకతో ఈ చిత్రాలకు ఆదరణ విపరీతంగా పెరిగింది. యువతలోని సృజనాత్మకతను, కొత్త ఆలోచనలను వెలికితీసేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో యువత అద్భుతమైన లఘు చిత్రాలను రూపొందిస్తోంది. ఈ చిత్రాల ద్వారా కొత్త దర్శకులు, నటీనటులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పాలకొల్లు నుంచి దాసరి, కోడి రామకృష్ణ, అల్లు రామలింగయ్య, అనంత శ్రీరామ్, రేలంగి వంటి ఎందరో కళాకారులు చిత్ర పరిశ్రమలో రాణించారు’’ అని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story