విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి, శాఖల మంత్రి నారా లోకేష్

  • చంద్రబాబు నేతృత్వంలో సింగపూర్ పర్యటన విజయవంతం
  • రికార్డులను సరిచేయడానికి సింగపూర్ పర్యటనకు వెళ్లాం
  • పెట్టుబడులను అడ్డుకునేందుకు తప్పుడు ఈ-మెయిల్స్ పెట్టించారు
  • గత పదేళ్లలో వచ్చిన పెట్టుబడులకంటే 14నెలల్లో వచ్చిందే ఎక్కువ

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో 4రోజులపాటు విజయవంతంగా సింగపూర్ లో పర్యటన పూర్తిచేశాం, రాబోయే అయిదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఎపిలో 45వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం, ఇది రాష్ట్రంలో యువతకు గుడ్ న్యూస్, జగన్ కు బ్యాడ్ న్యూస్ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో 4రోజుల పాటు నిర్వహించిన సింగపూర్ టూర్ విశేషాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... 1995 నుంచి సింగపూర్ తో చంద్రబాబుకి అనుబంధం ఉంది. సింగపూర్ లో మాకు తెలుగువారు ఘనస్వాగతం పలికారు, సింగపూర్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 2వేలమంది తెలుగువారు వచ్చారు, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పలు కంపెనీల నుంచి కమిట్ మెంట్స్ తీసుకున్నాం, రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఉదయం 8 నుంచి రాత్రి 11.30వరకు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. సిఎంతో పాటే మేం కూడా పోటీపడి పనిచేస్తున్నామన్నారు.

రికార్డులను సరిచేయడానికే వెళ్లాం

అధికారంలో ఉన్నా, లేకపోయినా చంద్రబాబుని అక్కడి ప్రభుత్వం గౌరవిస్తూ వస్తుంది. సిఎం నేతృత్వంలో నారాయణ, టిజి భరత్ నేను, అయిదుగురు ఐఎఎస్ లు సింగపూర్ వెళ్లాం. రికార్డులను సరిచేయడానికే వెళ్లాం. గతంలో వారితో మాట్లాడకుండా ఏకపక్షంగా ఒప్పందాలు రద్దుచేసి సింగపూర్ కంపెనీలను తరిమేశారు. ప్రపంచవ్యాప్తంగా పారదర్శకతలో టాప్ – 5లో సింగపూర్ ఉంటుంది. అలాంటి దేశంపై అవినీతి ముద్రవేసేందుకు ప్రయత్నించారు. దీనివల్ల భారతదేశం కూడా నష్టపోయింది. మన రిప్యూటేషన్ పోయింది. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ ధర్మన్ షణ్ముగ రత్నం, మంత్రి టాన్ సీలింగ్ తో సహా అక్కడ ప్రభుత్వ పెద్దలందరితో చర్చలు జరిపాం. నాలుగురోజుల్లో ముఖ్యమంత్రి 26 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. నేను 19 పారిశ్రామికవేత్తలతో చర్చలతో సహా 35 కార్యక్రమాలకు హాజరయ్యాను. టువాస్ పోర్టు, జురాంగ్ పెట్రో కెమికల్స్, ఐటి, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, స్పోర్ట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలతో చర్చించామని లోకేష్‌ చెప్పారు.

సెప్టెంబర్ లో విశాఖకు టిసిఎస్!

ఈ ఏడాది సెప్టెంబర్ లో విశాఖపట్నంలో టిసిఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని లోకేష్‌ ప్రకటించారు. అక్టోబర్ లో కాగ్నిజెంట్ వస్తుంది. ఎపి బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన సిఎం సింగపూర్ నుంచే ఆదేశాలు ఇచ్చారు. తప్పుడు ప్రచారం వల్ల స్టార్టప్ కంపెనీలకు అనుమానాలు వస్తాయి. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఆర్ బిఐ, సెబీకి మెయిల్స్ పంపారు, ఇప్పుడు సింగపూర్ లో మినిస్టర్స్, సెక్రటరీలకు పంపారు, నిన్న కోర్టులో కేసు వేశారు. భూముల విషయంలో వైసిపి నాయకులు చెప్పినట్లు చేస్తే హెచ్ సిఎల్ వచ్చేది కాదు, ఈరోజు అక్కడ 4,500 మంది పనిచేస్తున్నారు. పరిశ్రమలకు సంబందించి మేం సరైన నిర్ణయమే తీసుకున్నాం. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 5వేల ఎకరాలు ఎందుకు అని ఆనాడు ప్రశ్నించారు. ఈరోజు భారత్ లోనే బెస్ట్ ఎయిర్ పోర్టుగా హైదరాబాద్ తయారైందని లోకేష్‌ పేర్కొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story