Speaker Ayyannapatrudu: రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘సంకల్పం 2.0’ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మూలాలను పూర్తిగా నాశనం చేయడంలో పోలీసులు ఎలాంటి రాజీకి పోకూడదని ఆయన స్పష్టం చేశారు.

విశాఖపట్నం పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల హాస్టళ్లలో రాత్రిపూట విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడవుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు గంజాయి బారిన పడితే వారి భవిష్యత్తు, కుటుంబాల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలని కోరారు. “మనందరికీ పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు రక్షణ కోసం పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు” అని పేర్కొన్నారు.

గంజాయి సరఫరాదారుల వివరాలు కావాలంటే తానే స్వయంగా ఇస్తానని, దమ్ముంటే వారిని అరెస్టు చేయాలని పోలీసులకు సవాల్ విసిరారు. అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారి పేర్లు తాను ఇస్తానని, వారిని అండమాన్ జైలుకు తరలించి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. సమాజ శ్రేయస్సు కోసం గంజాయి నియంత్రణపై తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story