CM Chandrababu: ప్రభుత్వ సేవలన్నింటినీ 'మన మిత్ర' ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని, అలాగే ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

క్యాంప్ కార్యాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల అధికారులతో మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, “మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు వినియోగించుకోవడంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. అర్బన్ ప్రాంతాల మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్ని క్యాంటీన్లలో సేవలు అందించాలి” అని సూచించారు.

తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతిరోజూ నమూనాలు తీయాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల భాగస్వామ్యం పెంచాలని ఆదేశించారు. ప్రకృతి, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని, ‘జలధార’ ఫలితాలు కనిపించేలా చూడాలని, వర్షాకాలంలో చెరువులు నిండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వ భూముల రక్షణకు సాంకేతికతను వినియోగించాలని, అనంతపురం జిల్లాలో అమలవుతున్న పైలట్ ప్రాజెక్టును పరిశీలించాలని సూచించారు. గంజాయి అరికట్టడం, మహిళలపై నేరాల నివారణలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సుపరిపాలనలో భాగంగా కొత్త విధానాలు ప్రవేశపెట్టామని, ఆర్టీజీఎస్, అవేర్ వంటి వ్యవస్థల ద్వారా పరిపాలనలో మెరుగులు దిద్దాలని చెప్పారు. ఈ తరహా పద్ధతులను కేంద్రం ఆసక్తిగా పరిశీలిస్తోందని, దిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ప్రజెంట్ చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ సమీక్షలో మంత్రి కొలుసు పార్థసారథి, సీఎస్ సాయిప్రసాద్ పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story