AP:అమరావతిలో ప్రతిష్టాత్మకమైన న్యాయ యూనివర్సిటీ 'ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్' ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ)కు చెందిన 'బి.సి.ఐ ట్రస్ట్ పెర్ల్ ఫస్ట్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ కార్యదర్శి జి.ప్రతిభా దేవి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

బీసీఐ ట్రస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో న్యాయ విశ్వవిద్యాలయం రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయుటకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో బిసిఐ అధ్యక్షుడు, కీలక సభ్యులు వేరువేరుగా సమావేశం అయ్యారు. బీసీఐ అమరావతిలో నెలకొల్పబోయే యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్ సైతం ఏర్పాటు కాను ంది అంతేకాక ఈ యూనివర్సిటీ న్యాయ, అనుబంధ రంగాల్లో ఉన్నత విద్యావకాశాల కల్పనకు నైపుణ్యాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది.


ప్రతిష్టాత్మకమైనటువంటి నేషనల్ స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ(ఎన్ఎల్ఎస్ఐయు) బెంగళూరులో 1986లో , ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్(ఐఐయుఎల్ఈఆర్) గోవాలో 2022లో బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డాయి.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story