ఉచిత బస్సు పథకానికి స్త్రీ శక్తి పేరు ఖరారు
ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మరో హామీని అమలు చేయడనికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ఈ ఆగస్టు 15వ తేదీ నంచి అమలు చేయడానికి కూటమి సర్కార్ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి స్ట్రీ శక్తి అని నామకరణం చేశారు. ఈ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళ లకు జీరో ఫేర్ టికెట్ కట్ చేస్తారు. టికెట్ పై స్త్రీ శక్తి అని ముద్రిస్తారు. ప్రస్తుతం కండక్టర్లకు స్త్రీ శక్తి టికెట్ పై శిక్షణ ఇస్తున్నారు. టికెట్ ఇన్స్యూ మిషన్...టిమ్ నుంచి జీరో ఫేర్ టికెట్...పై ఆర్టీసీ కండక్టర్లకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర మంతా యూనిట్ గా చేసుకుని ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వాలనే అలోచన లో ప్రభుత్వం ఉంది. అయితే ఈ విషయం పై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో మహిళలకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, జీరో ఫేర్ టిక్కెట్లు, ఉచిత ప్రయాణ పరిధి జిల్లాకు పరిమితం చేయాలా లేకపోతే రాష్ట్ర, అంతర్రాష్ట్ర సర్వీసులు తిరిగే బస్సుల్లో కూడా ఈ సౌకర్యం కల్పించాలా అనే అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు కానుంది.
