TDP: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 22 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందులో ఒక మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌ అభ్యర్థి, 21 మున్సిపాలిటీలకు ఛైర్‌పర్సన్ అభ్యర్థులు ఉన్నారు.

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా షేక్ అబ్దుల్ అబీదా పేరు ఖరారైంది. నర్సీపట్నం మున్సిపాలిటీకి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించారు.

ఈ జాబితాలో చేరిన ఇతర అభ్యర్థులు:

చీరాల – హనీ స్పందన

డోన్ – కోట్ల సుజాతమ్మ

ప్రొద్దుటూరు – నంద్యాల రాఘవరెడ్డి

కదిరి – షేక్ సమీరా

కళ్యాణదుర్గం – బుట్న లక్ష్మి

గుత్తి – గోవిందరాజులు తమిళ్ సెల్వి

గుంతకల్లు – యశోద

ఆకివీడు – నిలోఫర్ షేక్

బేతంచెర్ల – ఐ. లోకేష్ గౌడ్

బుచ్చిరెడ్డిపాలెం – దొడ్ల విజయలక్ష్మి

జంగారెడ్డిగూడెం – రొంగల అనూష

కొండపల్లి – కన్నెకంటి అమూల్య

కొవ్వూరు – జొన్నలగడ్డ రాధారాణి

నాయుడుపేట – షకీరా

నందిగామ – శాకమూరి వంశీధర్

నందికొట్కూరు – ఈ.ఎం. సబురున్నీసా

వెంకటగిరి – దొంతు శారద

ఉయ్యూరు – చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్

ఏలేశ్వరం – యార్లగడ్డ అక్షిత

ఎమ్మిగనూరు – మాచాని సునీత

గత రోజు రాత్రి తొలి జాబితాలో 36 మంది అభ్యర్థులను (ఏడు కార్పొరేషన్లకు మేయర్లు, 26 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు ఛైర్‌పర్సన్లు) ప్రకటించిన టీడీపీ, ఈ రెండో జాబితాతో మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కీలక నేతలు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులకు అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Next Story