Rajya Sabha: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ, జనసేన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో నాలుగు స్థానాలకు నలుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవంగా ఖరారైంది.

టీడీపీ తరఫున సానా సతీశ్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లు, జనసేన తరఫున లింగమనేని రమేశ్ లు నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నలుగురు అభ్యర్థుల ఎన్నిక దాదాపు ఖరారైంది. మరికాసేపట్లో రిటర్నింగ్ అధికారిణి వనిత రాణి వారికి అధికారిక ధృవీకరణ పత్రాలు (ఫారం-22) అందించనున్నారు.

భారత ఎన్నికల సంఘం జూన్ 1న ఆంధ్రప్రదేశ్‌తోపాటు 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. జూన్ 18న 27 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండగా, ఖాళీ అయిన మరో మూడు స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. జూన్ 20 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story