బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో వైఎస్‌ జగన్‌ డిమాండ్‌

ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వేల మంది రైతులు ఇక్కడకి వచ్చి తమ ఆవేదన చెప్పుకున్నారని మజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధినేత వైఎస్‌.జగన్మోహనరెడ్డి అన్నారు. బుధవారం ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డ్‌ సందర్శించారు. కనీస గిట్టుబాటు ధర లభించక తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించి వారి కష్టాలు వినేందుకు జగన్‌ మార్కెట్‌ యార్డుకు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌.జగన్‌ మాట్లాడుతూ మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు. నేను వస్తున్నానని 2వేల మంది పోలీసులను మోహరించారన్నారు. రైతులను రాకుండా అడ్డుకున్నారన్నారు. ఎందకీ ఆంక్షలు, ఐదు వందల మందే రావాలని ఎందుకు అన్నారు అని జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీలో వరికి కూడా ధర లేదని, కనీసం రూ.300 తక్కువకు అమ్ముకుంటున్నారని చెప్పారు. పెసర, జొన్న, చివరికి మామిడి కూడా కనీస గిట్టుబాట ధర లభించడం లేదని అన్నారు. ప్రతి యేటా మే మొదటి వారంలో మామిడి కొనుగోళ్ళ మొదలు పట్టాల్సి ఉండగా ఎందుకు ఆ పని చేయలేదని వైఎస్‌.జగన్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. జూన్‌ రెండో వారం వరకూ కొనుగోళ్ళు చేపట్టకపోవడంతో మొత్తం పంట అంతా ఒక్కసారిగా మర్కెట్‌ ను ముంచెత్తిందన్నారు. సరుకు ఎక్కవ కనిపిస్తుండటంతో కంపెనీలు దరలను తగ్గించాయని జగన్‌ ఆరోపించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 52 పల్ప్‌ కంపెనీలు ఉన్నాయని అయినా రైతులకు ధర రావడం లేదన్నారు. మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి కాయలను రూ.29 కి కొనుగోలు చేశామని జగన్‌ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో కనీసం రూ.12 కూడా రావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మొత్తం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్‌.జగన్‌ డిమాండ్‌ చేశారు. రైతుల నుంచి తక్షణం పంట కొనకపోతే రైతుల పక్షన నిలబడి పోరాడతానని జగన్‌ హెచ్చరించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story