Investiments in Kuppam : కుప్పం దశ తిరిగింది… రూ1,617 కోట్ల పెట్టుబడుల వరద
చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలు

తన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో యువతను వృత్తి నైపుణ్యులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు ప్రారంభించారు. ఇందుకు గానూ నైపుణ్య శిక్షణ ఇచ్చే నాలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. సియం చంద్రబాబునాయుడి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాల విలువ రూ.1.617 కోట్లు. ఇందులో ప్రధానమైనది హిందాల్కో జనసేవా ట్రస్. ఈ ట్రస్ట్ భాగస్వామ్యంలో కుప్పంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుప్పం పరిధిలో వచ్చే మూడేళ్ళలో వెయ్యి మంది యువకులను స్కిల్డ్ వర్కర్లుగా తీర్చిద్దనున్నారు. అదే సమయలో 750 కుటుంబాలుకు జనసేవా ట్రస్ట్ ద్వారా ఉపాధి కల్పించనున్నారు. అంతే కాకుండాడా చంద్రబాబు నాయుడ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీ4 పధకంలో భాగంగా హిందాల్కో జనసేవా ట్రస్ట్ 50 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించింది.
ఇక ఇ-ఆటోలు, ఇ-బైక్స్, ఇ-స్వీపింగ్ ఎలక్ట్రిక్ మెషిన్లు తయారు చేసే ఇ-రాయిస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్ధ కుప్పం నియోజకవర్గంలో రూ. 200 కోట్ల వ్యయంతో కంపెనీ ప్రారంభించనుంది. ఈ కంపెనీ ద్వారా 40 మందికి ఉపాధి లభించనుంది. అలాగే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కల్పించడంతో పాటు ప్రస్తుతం ఆయా రంగాల్లో పనిచేస్తన్న యువతకు కూడా స్కిల్ డెవలప్మెంట్ లో ఈ సంస్ధ శిక్షణ ఇవ్వనుంది. అంతేకాకుండా కుప్పం నియోజకవర్గంలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ నిమిత్తం 130 ఇ-ఆటోలను ఇ-రాయిస్ సంస్ధ అందించడానికి ఒప్పందం చేసుకున్నారు.
అదేవింగా రూ.525 కోట్ల వ్యవయంతో సమీకృత పాల ఉత్పత్తుల పోషకాహార కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి ఏస్ ఇంటర్నేషనల్ సంస్ధతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రోజుకు 7.5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసేలా ఈ సంస్ధ ప్లాంట్ నిర్మించడానికి చంద్రబాబు సమసక్షలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. ఈ సంస్ధ ఏర్పాటు ద్వారా ఏడు వేల మందికి ప్రత్యక్షం గానూ పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది. పాడి రైతులకు కూడా తమ వంతు సహకారం ఈ సంస్ధ అందిస్తుంది.
అలాగే రూ.372.8 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం మరో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 2 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరేలా ప్ఎస్వీఎఫ్ సోయా లిమిటెడ్ సంస్ధ కుప్పంలో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ సంస్ధ మూడు వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న మూడు కంపెనీలు 2026 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాశికలు సిద్దం చేసుకున్నాయి. ఈ సంస్ధల ఏర్పాటకు కావాల్సిన అన్ని రకాల అనుమతులతో పాటు పూర్తి సహాయ, సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
