Balineni Srinivasa Reddy: గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోనే రాజధాని నిర్మించాలని జగన్‌మోహన్‌రెడ్డికి ఆనాడే సూచించానని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్ కారణంగానే తాను ఎన్నికల్లో ఓడిపోయానని, వ్యక్తిగత కారణాల వల్ల కాదని స్పష్టం చేశారు.

జగన్‌కు పార్టీని అభివృద్ధి చేసే సామర్థ్యం లేదని విమర్శించిన బాలినేని, ‘‘జగన్ మూర్ఖత్వపు నిర్ణయాల వల్లే ఇప్పుడు పార్టీ మావిగన్ అంటున్నారు. సీఎంగా ఉన్నప్పుడు బటన్ నొక్కడం తప్ప మరేం చేశారు?’’ అని ప్రశ్నించారు. తన కుమారుడు ఎప్పటినుంచో రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నాడని, ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనలో చేరిన తనకు పదవులు అడగడానికి ఎలాంటి అర్హత లేదని కూడా అన్నారు.

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో కీలక నేతగా కొనసాగుతూ, రాష్ట్ర రాజకీయాలపై తన అభిప్రాయాలు స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story