హైకోర్టుకు పోలీసులు దేవ్‌జీ, మల్లారెడ్డిపై స్పష్టత

Police Clarify to High Court on Devji and Mallareddy: మావోయిస్టు నేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చాలంటూ దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ ఇద్దరూ పోలీసు కస్టడీలో లేరని, అరెస్టు చేసిన ఇతర మావోయిస్టులను సంబంధిత మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చామని పోలీసులు ధర్మాసనానికి తెలియజేశారు.

దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి పోలీసు ఆధీనంలోనే ఉన్నారనేందుకు నిర్దిష్టమైన ఆధారాలు సమర్పించాలని హైకోర్టు పిటిషనర్లను ఆదేశించింది. పోలీసులు ఈ మావోయిస్టు కీలక నాయకులు తమ వశంలో ఉన్నారంటూ ప్రెస్‌మీట్‌లో ప్రకటన ఇచ్చారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఆ ప్రెస్‌ స్టేట్‌మెంట్‌ను కోర్టు ముందు ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.

ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story