Chandrababu: రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే.. సైకిల్‌పై సైకిల్ పవర్ చాటాలి: చంద్రబాబు
సైకిల్‌పై సైకిల్ పవర్ చాటాలి: చంద్రబాబు

Chandrababu: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య సందేశం ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు పూర్తయిందని, రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఎప్పటికీ ఒక్కటేనని అన్నారు.
హైదరాబాద్, అమరావతి ప్రపంచ స్థాయి నగరాలుగా వెలగాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలని ఆకాంక్షించారు. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేకూరాలని, వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని సాధించడంలో రెండు రాష్ట్రాలు కలిసి కీలక పాత్ర పోషించాలని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఇదే సందర్భంగా తెదేపా ఎమ్మెల్యేలకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
చంద్రబాబు ముఖ్యాంశాలు:
2002 తర్వాత మొదటిసారి ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
జనసేన, భాజపాతో సమన్వయం చేసుకొని ‘సర్’ను పర్యవేక్షించాలి.
జులై 14 లోపు ఓట్లు సరిచేసుకోవాలి.
ప్రతి బుధవారం పార్టీ క్యాలెండర్ అమలు తప్పనిసరి.
ఎలక్ట్రిక్ సైకిల్‌పై తిరగండి. ఖర్చు సున్నా, ఆరోగ్యం మెరుగు. ‘సైకిల్ పవర్’ చాటాలి.
ఈ నెల 4న ఎన్డీయే సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. 2024లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువ ఓట్లు సాధించాలని పిలుపునిచ్చారు.

