విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఘటన

యాదాద్రి జిల్లాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సెక్యురిటీ ఇంటెలిజెన్స్‌ డీఎస్‌పీలతో పాటు ఒక డ్రైవర్‌ మృతి చెందారు. శక్రవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఏపీ ఇంటెలిజెన్స్‌ డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావులు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం బైతాపురం వద్ద వెనక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీ కొంది. ఈఘటనలో డీఎస్పీలు చక్రధరరావు, శాంతారావులతో పాటు డ్రైవర్‌ కూడా అక్కడిక్కడే మృతి చెందారు. డీఎస్పీలు విధినిర్వహణలో భాగంగా డిపార్ట్‌మెంట్‌ వెహికిల్‌ మీద శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేశారు. శనివారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హోంమత్రి వంగలపూడి అనితలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విధి నిర్వహణలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడం బాధకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ అదనపు ఎస్పీ కె.డి.ఎం.వి.ఆర్ ప్రసాద్ మరియు డ్రైవర్ హెడ్ కానిస్టేబుల్ నర్సింహరాజును మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated On 26 July 2025 12:02 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story