నేడు ప్రభుత్వానికి సమర్శించనున్న విజిలెన్స్‌ విభాగం… కేసు ఏసీబీకి అప్పగించే అవకాశం

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ఈవెంట్‌లో అనేక అవకతవకలు జరిగాయని ఏపీ విజిలెన్స్‌ విభాగం నిగ్గు తేల్చినట్లు సమాచారం. ఈ మేరకు విజెలెన్స్‌ విభాగం విచారణ నివేదికను నేడు సోమవారం ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ హాయంలో వందల కోట్ల రూపాయల వ్యవయంతో నిర్వహించిన ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అనేక అక్రమాలు జరిగాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని అసెంబ్లీలో పలువురు శాసనసభ్యులు ప్రస్తావించారు. ఈ ఈవెంట్‌పై విచారణ జరిపించాలని శాసనసభ్యులు కోరడంతో ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆడుదాం ఆంధ్ర ఈవెంట్‌లో దాదాపు 40 కోట్ల మేర నిదులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్‌ విభాగం తేల్చినట్లు సమాచారం. నేడు విజిలెన్స్‌ విభాగం సమర్పించబోయే నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట కేసు నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2023 డిసెంబర్‌ మాసంలో ఆడుదాం ఆంధ్ర క్రీడల టోర్నమెంటును 47 రోజుల పాటు నిర్వహించింది. ఈ టోర్నమెంటు నిర్వహణకు గానూ రూ.125 కోట్లను అప్పటి ప్రభుత్వం కేటాయించింది.

ఆడుదాం ఆంధ్రాపై విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అనేక సంచలన విషయాలు వెల్లడించింది. ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి అనేక జిల్లాల్లో కలెక్టర్లు అదనంగా నిధులు కేటాయించినట్లు విజిలెన్స్‌ విభాగం విచారణలో బయటపడినట్లు చెపుతున్నారు. క్రీడాకారులకు నాసిరకం కిట్లు పంపిణీ చేసినట్లు, పైగా ఆయ క్రీడా పరికరాలపై బ్రాండెడ్‌ స్టిక్కర్లు వేసినట్లు విజిలెన్స్‌ విచారణలో వెలుగు చూసినట్లు చెపుతున్నారు. ఈ క్రీడా పోటీల్లో వైసీపీకి చెందిన కార్యకర్తలనే విజేతలుగా ఎంపిక చేసినట్లు విజిలెన్స్‌ విభాగం గుర్తించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త శాప్‌ చైర్మన్‌ని నియమించిందని ఆయన ఛార్జ్‌ తీసుకునే లోపలే కొంత మంది అధికారులు కంప్యూటర్ల నుంచి వివరాలను డిలీట్‌ చేసినట్లు చెపుతున్నారు. అప్పటి క్రీడా మంత్రి ఆర్కేరోజా ఆమో సోదరుడి పాత్రపై కూడా విజిలెన్స్‌ విభాగం ఆధారాలు సేకరించినట్లు సమాచారం. విజిలెన్స్‌ అధికారులు నివేదిక సమర్పించిన తరువాత కేసును ఏసీబీకి అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్‌ఆర్‌సీపీలో కీలక నేతలను అరెస్టులు చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఈ క్రమంలోనే ఆడుదాం ఆంధ్రపై లేనిపోని ఆరోపణలు చేసి వైఎస్‌ఆర్‌సీపీ ఫైర్‌ బ్రాండ్‌ ఆర్కేరోజా, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

Politent News Web 1

Politent News Web 1

Next Story