✕
Vijayawada: ప్రకాశం బ్యారేజీ వద్ద అప్రమత్తం – రెండో ప్రమాద హెచ్చరిక
By PolitEnt MediaPublished on 28 Sept 2025 1:39 PM IST
రెండో ప్రమాద హెచ్చరిక

x
Vijayawada: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు రెండో దశ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటి ఇన్‌ఫ్లో మరియు ఔట్‌ఫ్లో 6.05 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో అధికారులు 69 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నది ద్వారా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. లంక గ్రామాలు మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితుల దృష్ట్యా, సమస్యలను పరిష్కరించేందుకు కొల్లూరు మండలంలో కంట్రోల్ రూమ్ (77948 94544) మరియు భట్టిప్రోలు మండలంలో కంట్రోల్ రూమ్ (81798 86300) ఏర్పాటు చేశారు.

PolitEnt Media
Next Story