అమలు చేయగలగాలి: చంద్రబాబు

CM Chandrababu: ప్రజల గుండెల్లో డా.బీ.ఆర్. అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో విద్యార్థులతో కలిసి మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని పాల్గొన్న ఆయన, యువతకు స్ఫూర్తి ఇచ్చేలా మాట్లాడారు. విజన్‌ను అమలు చేసే నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకోవడమే విజయానికి మార్గమని సీఎం సూచించారు.

అమరావతిలోని అసెంబ్లీలో విద్యార్థులతో జరిగిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విజన్ ఉంటే సరిపోదు.. దాన్ని అమలు చేయడం ముఖ్యం. నిరంతర శ్రమతోనే మనం కలిగి ఉన్న ఆలోచనలను సాకారం చేసుకోగలం. సంక్షోభాలను అవకాశాలుగా మలిచుకుని ముందుకు సాగాలి” అని అన్నారు.

చంద్రబాబు తన అనుభవాలను పంచుకుంటూ, “చిన్న వయసులోనే నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను. ఈ అనుభవం నాకు నేర్చుకున్న పాఠాలు చాలా” అని చెప్పారు. మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులను కొనియాడిన సీఎం, “విద్యార్థులు చాలా బాగా మాట్లాడారు. వారు ఎక్కడా తడబడలేదు. ఈ కార్యక్రమం బాధ్యత గుర్తుపెట్టుకునేలా, స్ఫూర్తిని రగిలించేలా ఉంది” అని ప్రశంసించారు.

ఈ కార్యక్రమం ద్వారా యువతకు రాజకీయ ప్రక్రియలు, నిర్ణయాల తీసుకోవడం గురించి అవగాహన కల్పించడమే లక్ష్యమని, ఇది భవిష్యత్ నాయకులను తయారు చేస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక అర్థం కలిగిస్తుందని ఆయన తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story