ఇక్కడ ఉన్నది చంద్రబాబు: సీబీఎన్

Chandrababu: వైకాపా ఫేక్ రాజకీయాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో బుధవారం జరిగిన ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభలో ఆయన ప్రసంగించారు.

‘‘వైకాపా తన ఉనికిని కోల్పోతోంది. పార్టీ ఆఫీసులు మూసుకుని, సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారు. ఎన్నికల సమయంలో సిద్ధం.. సిద్ధం అని గట్టిగా గొంతు చించుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదాను నేను కాదు, ప్రజలు ఇస్తారు. అసెంబ్లీకి రాకుండా రప్పా రప్పా అంటూ రంకెలు వేస్తున్నారు. రప్పా రప్పా అంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది సీబీఎన్. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే, 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి పట్టుకుంటారు’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

‘‘పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో వైకాపా బెండు తీయబడింది. రాయలసీమలో 52 సీట్లలో 45 సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకుంది. హింసాత్మక రాజకీయాలు చేస్తే చట్టం ముందు నిలబెట్టడం నా బాధ్యత. వైకాపా అధినేత ధ్రుతరాష్ట్ర కౌగిలితో ఉంటాడు, ఆయనను నమ్మితే నాశనమే. అనంతపురం అభివృద్ధికి బ్లూప్రింట్ సిద్ధం చేశాం. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొచ్చాం. వైకాపా ఐదేళ్లలో చేయలేని పనిని మేము 100 రోజుల్లో పూర్తి చేశాం. రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమ. రాయలసీమలో శాశ్వతంగా కరవును నివారిస్తాం. రాష్ట్రాభివృద్ధి కోసం నేను, పవన్ కల్యాణ్ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం. మా సంకల్పానికి ప్రధాని నరేంద్ర మోదీ అండగా ఉన్నారు’’ అని చంద్రబాబు వివరించారు.

ప్రజల దీవెనలతో కూటమి కొనసాగుతుంది..

‘‘తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు గర్వంగా తిరిగేలా పాలన అందిస్తున్నాం. ఏపీకి సహకరిస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. మేము పాలకులం కాదు, సేవకులం. అవినీతి మన దరి చేరనివ్వం. మూడు పార్టీల కార్యకర్తలు ఐకమత్యంతో ఉండాలి. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన, సంపదతో కూడిన, సంతోషకరమైన సమాజం కోసం పనిచేస్తున్నాం. అందరి క్షేమం కోసం పీ4 పథకాన్ని తీసుకొచ్చాం. నా చివరి శ్వాస వరకు పేదల కోసం పనిచేస్తా. కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం సూపర్ హిట్. ఏపీని అన్ని రంగాల్లో సూపర్ హిట్ చేద్దాం, దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపద్దాం. ప్రజల దీవెనలతో ఈ కూటమి కొనసాగుతుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story