కూటమి నేతల దిష్టి తగలకుండా ఇలా చేసామంటున్న మహిళా నేతలు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌.జగన్మోహనరెడ్డి తాడేపల్లి నివాసం వద్ద ఆ పార్టీ మహిళా నేతలు సోమవారం గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. వైఎస్‌ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ నాయకుడు బరిగెల కోటేష్‌ ఆధ్వర్యలో ఆ పార్టీ మహిళా నేతలు వైఎస్‌.జగన్‌ పై ఉన్న దిష్టి పోవాలని వందలాది గుమ్మడి కాయలు కొట్టారు. రాష్ట్రలో వైఎస్‌.జగన్‌ ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినా కూటమి దుష్ట శక్తులు వెంటాడుతున్నాయని ఇలా గుమ్మడి కాయలు పగలగొట్టి దిష్టి తీసినట్లు మహిళా నేతలు చెపుతున్నారు. జగన్‌ పర్యటనలకు వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి కూటమి నాయకులు తట్టుకోలే దుష్ట పన్నాగాలు పన్నుతున్నారని, జనం ధాటికి తామెక్కడ భూస్ధాపితం అవుతామో అనే ఆందోళణలో జగన్ను భూస్ధాపితం చేస్తామని కూటమి నేతల ప్రేలాపనలు పేలుతున్నారని అందుకే జగన్‌ నివాసం ముందు ఆయనకు గుమ్మడి కాయలతో దిష్టి తీశామని మహిళా నేతలు పేర్కొన్నారు. తమ నాయకుడికి నరదిష్టి, కూటమి పాలకుల దిష్టి పోవాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడూ గుమ్మడి కాయలతో దిష్టి తీస్తామని మహిళా నేతలు అన్నారు.

Updated On 14 July 2025 5:56 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story