YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివేకా కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి సంచలన లేఖ రాశారు.

హత్య జరిగి ఏడేళ్లు దాటినా కేసు మిస్టరీ ఇంకా తేలలేదని ఆమె పేర్కొన్నారు. ‘ఆ నాలుగు కీలక అంశాలపై’ పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. ఆయుధం ఇప్పటికీ దొరకలేదని, సీబీఐ దర్యాప్తుపై తనకు అసంతృప్తి ఉందని తెలిపారు.

రూ. కోట్ల మనీ ట్రయల్, హత్య వెనుక ఉన్న ‘పెద్ద కుట్ర’ కోణాన్ని పూర్తిగా వెలికితీయాలని రాష్ట్రపతికి విన్నవించారు. మరణవార్త బయటకు రాకముందే వైఎస్ జగన్‌కు ఎలా తెలిసింది? అనే అంశంపై సీబీఐ అఫిడవిట్ ఆధారంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇంకా ఉన్న అస్పష్ట అంశాలపై విచారణ జరిపించాలని కోరుతూ గతంలో తెలంగాణ హైకోర్టులో అప్పీల్ కూడా చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కూడా లేఖ ప్రతులను సునీతా రెడ్డి పంపించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story