రూ.6.29 లక్షలకే అద్బుతమైన కారు

2025 Renault Kiger : ఆటోమొబైల్ ప్రపంచంలో సేఫ్టీ, ఫీచర్ల ప్రాధాన్యత వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెనాల్ట్ ఇండియా తమ ప్రముఖ ఎస్‌యూవీకి కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. కొత్త రెనాల్ట్ కైగర్ 2025 ఇప్పుడు మరింత సురక్షితంగా మారింది. ఇందులో కంపెనీ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 21 అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లను అందించింది. ఇంత పవర్‌ఫుల్, సురక్షితమైన కారు ప్రారంభ ధర కేవలం రూ.6.29 లక్షలు కావడం విశేషం. స్టైలిష్ డిజైన్, ఆధునిక ఇంటీరియర్, శక్తివంతమైన పర్ఫార్మెన్స్‌తో ఈ కారు ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

రెనాల్ట్ ఈసారి కైగర్ వేరియంట్ వ్యూహాన్ని కూడా మార్చింది. ఇప్పుడు ఈ కారు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

* ఆథెంటిక్ (బేస్ వేరియంట్): రూ.6.29 లక్షలు

* ఎవల్యూషన్: రూ.7.09 లక్షలు

* టెక్నో: రూ.8.90 లక్షలు

* ఎమోషన్: రూ.9.14 లక్షలు

ఈ ధరలన్నీ నాన్-టూబో పెట్రోల్ ఇంజిన్‌కు సంబంధించినవి.

టర్బో-పెట్రోల్ వేరియంట్ల విషయానికి వస్తే, టెక్నో (CVT గేర్‌బాక్స్‌తో) కోసం రూ.9.99 లక్షలు, ఎమోషన్ (టర్బో పెట్రోల్) కోసం రూ.9.99 లక్షల నుండి రూ.11.29 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్త కైగర్ లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి చిన్నపాటి మార్పులు చేశారు. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. డిఆర్‌ఎల్‌లు పాతవిగానే ఉంచబడ్డాయి. 16-ఇంచ్ కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో చాలా చిన్న మార్పులు, కొత్త ఓయాసిస్ ఎల్లో రంగు ఎంపిక ఇందులో చేర్చబడ్డాయి. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి ఇంటీరియర్‌లో కూడా చాలా అప్‌డేట్‌లు చేశారు. ఇందులో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంది.

మెరుగైన సేఫ్టీ ఫీచర్లు

6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు, 21 యాక్టివ్, పాసివ్ భద్రతా ఫీచర్లు (హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి) ఇందులో ఉన్నాయి. కొత్త కైగర్‌లో పాత మోడల్‌లో ఉన్న ఇంజిన్ ఎంపికలే లభిస్తాయి. 1.0L సహజంగా ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 71 బీహెచ్‌పీ పవర్, 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story