ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ రేంజ్ మాములుగా లేదుగా

Hyundai Exter 2026 : హ్యుందాయ్ మోటార్ ఇండియా తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ ఎక్స్టర్‎ను సరికొత్త హంగులతో 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తాజాగా లాంచ్ చేసింది. మార్కెట్లో టాటా పంచ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేలా ఈ చిన్న ఎస్‌యూవీకి అదిరిపోయే కాస్మెటిక్ అప్‌డేట్స్, టెక్ ఫీచర్లను జోడించింది. సైజులో మార్పులు లేకపోయినా, చూసేందుకు మాత్రం మునుపటి కంటే చాలా స్టైలిష్‌గా, ప్రీమియంగా కనిపిస్తోంది. కొత్త 2026 హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రారంభ ధర రూ.5.80 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై టాప్ వేరియంట్ రూ.9.42 లక్షల వరకు ఉంది. కంపెనీ తన వేరియంట్ల పేర్లను కూడా మార్చింది. ఇప్పుడు ఇవి HX2, HX3, HX4, HX6, HX8, HX10 పేర్లతో లభిస్తాయి. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, డెలివరీలు ఈ నెలాఖరు నుంచి మొదలయ్యే అవకాశం ఉంది.

కొత్త ఎక్స్టర్ ముందు భాగం ఇప్పుడు మరింత వెడల్పుగా, దృఢంగా కనిపిస్తుంది. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు దీనికి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. 15-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్‌తో వస్తున్నాయి. వెనుక భాగంలో వింగ్-టైప్ స్పాయిలర్, అప్‌డేటెడ్ టెయిల్‌గేట్ గమనించవచ్చు. ఈసారి గోల్డెన్ బ్రాంజ్, టైటానియం బ్లాక్ మ్యాట్ అనే రెండు సరికొత్త రంగులను కంపెనీ పరిచయం చేసింది.

లోపలి భాగంలో ఆల్-బ్లాక్ థీమ్ స్థానంలో ఇప్పుడు నేవీ బ్లూ, గ్రే డ్యూయల్-టోన్ ఫినిషింగ్ ఇచ్చారు. డాష్‌బోర్డ్‌పై 3D కార్బన్ ప్యాటర్న్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫీచర్ల పరంగా సెగ్మెంట్-ఫస్ట్ బిల్ట్-ఇన్ డాష్‌క్యామ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే, వెనుక ప్రయాణికుల కోసం టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటివి చేర్చారు. మెటల్ పెడల్స్, ఫోల్డబుల్ డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ వంటి సౌకర్యాలు ఈ బడ్జెట్ కారును లగ్జరీగా మార్చాయి.

సేఫ్టీ విషయంలో హ్యుందాయ్ అస్సలు తగ్గలేదు. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ (HAC) వంటి 30 ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా వస్తాయి. ఇంజిన్ పరంగా ఎటువంటి మార్పు లేదు. మునుపటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (83 hp), CNG ఆప్షన్లు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి CNG వెర్షన్‌లో డ్యుయో సిలిండర్ టెక్నాలజీ వల్ల బూట్ స్పేస్ కూడా మెరుగ్గా ఉంటుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story