25 భారీ మార్పులతో రోడ్లపై రచ్చ

Hyundai Verna : హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఐకానిక్ సెడాన్ హ్యుందాయ్ వెర్నాను సరికొత్త హంగులతో 2026 అప్‌డేటెడ్ మోడల్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగొందుతున్న వెర్నా, ఈసారి ఏకంగా 25కు పైగా భారీ మార్పులతో మన ముందుకు వచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.10.98 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, టెక్నాలజీ పరంగా కూడా ఇది నెక్స్ట్ లెవల్ అనిపించేలా ఉంది.

డిజైన్ అప్ డేట్స్

కొత్త వెర్నా డిజైన్ మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఇందులో సరికొత్త బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్, రియర్ బంపర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాత్రిపూట ప్రయాణాల్లో వెలుతురు కోసం డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్ లాంప్‌లను అమర్చారు. వీటికి తోడు 16 అంగుళాల డైమండ్ కట్ అలోయ్ వీల్స్ కారుకు ఒక ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత వెడల్పైన (1,765 mm) సెడాన్ కావడంతో, లోపల కూర్చునే ప్రయాణికులకు చాలా విశాలమైన అనుభూతి కలుగుతుంది. దీని వీల్ బేస్ 2,670 mm కావడం విశేషం.

లగ్జరీ కేబిన్

కారు లోపలికి వెళ్తే ఒక లగ్జరీ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుంది. స్పోర్టీ లుక్ కోసం D-కట్ స్టీరింగ్ వీల్, లెదరెట్ సీట్లు, డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్‌తో కూడిన 8-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా ప్యాసింజర్ సీట్ ఎలక్ట్రిక్ వాక్-ఇన్ డివైజ్‎ను హ్యుందాయ్ పరిచయం చేసింది. అంటే డ్రైవర్ సీటులో కూర్చునే వెనుక ప్రయాణికులకు అనుగుణంగా ముందు సీటును అడ్జస్ట్ చేయవచ్చు. 528 లీటర్ల భారీ బూట్ స్పేస్ మీ ప్రయాణాల్లో సామాన్లను సర్దుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

70 కనెక్టెడ్ ఫీచర్లు

టెక్నాలజీ విషయంలో వెర్నా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో 10.25 అంగుళాల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంది (ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్). వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వెంట్లేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హ్యుందాయ్ బ్లూలింక్ టెక్నాలజీ ద్వారా 70కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లను వాడుకోవచ్చు. మ్యూజిక్ లవర్స్ కోసం బోస్ ప్రీమియం 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, సేఫ్టీ కోసం బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, సరౌండ్ వ్యూ మానిటర్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి.

ధరలు, పోటీ

హ్యుందాయ్ వెర్నా 2026 బేస్ వేరియంట్ ధర రూ.10,98,400 కాగా, టాప్ మోడల్ ధర రూ.18,25,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మార్కెట్లో ఇది నేరుగా హోండా సిటీ, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి బలమైన ప్రత్యర్థులతో తలపడనుంది. కంఫర్ట్, లగ్జరీ, అదిరిపోయే పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ కొత్త వెర్నా బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story