Mahindra Thar: మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ రానుందోచ్.. మార్కెట్లోకి రాకముందే కొత్త డిజైన్ లీక్!
కొత్త డిజైన్ లీక్!

Mahindra Thar: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ మహీంద్రా థార్ త్వరలోనే కొత్త రూపంలో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న ఈ వీరుడికి కంపెనీ మరింత ఆకర్షణీయమైన హంగులను అద్దనుంది. లాంచ్‌కు ముందే ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ రోడ్డు మీద టెస్టింగ్ సమయంలో కనిపించడం ఆటోమొబైల్ లవర్లలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ముందు భాగంలో సరికొత్త డిజైన్ మార్పులు
ప్రస్తుతం రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటున్న మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ప్రధానంగా ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా మార్చేశారు. ఇటీవల విడుదలైన థార్ రాక్స్ డిజైన్‌ను పోలిన సరికొత్త గ్రిల్‌ను ఇందులో అమర్చినట్లు స్పష్టమవుతోంది. దీనితో పాటు గుండ్రటి ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు అలాగే సీ-షేప్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లను అందించారు. ఫ్రంట్ బంపింగ్ డిజైన్‌ను కూడా మార్చి, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను పొందుపరిచారు.
అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అలాగే లగ్జరీ ఇంటీరియర్
ఈ కొత్త ఎస్‌యూవీ కేబిన్ లోపల అనేక అధునాతన మార్పులు ఉండే అవకాశం ఉంది. డ్రైవింగ్ అనుభూతిని మరింత మెరుగుపరచడానికి టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను ఇవ్వనున్నారు. సీట్ల కోసం అత్యంత నాణ్యమైన లెదరెట్ అప్హోల్స్ట్రీని వాడారు. అంతేకాకుండా భద్రతకు పెద్దపీట వేస్తూ టాప్ ఎల్ఎక్స్ వేరియంట్‌లో లెవెల్-2 ఏడీఏఎస్ ఫీచర్‌ను కూడా అందించే ఛాన్స్ ఉంది.
పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు యథాతథం
ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుత మోడల్‌లో ఉన్న మూడేు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లనే ఇందులోనూ కొనసాగించనున్నారు. 1.5 లీటర్ టర్బో డీజిల్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ అలాగే 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లు ఇందులో లభిస్తాయి. మాన్యువల్ అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో పాటు 4-వీల్ డ్రైవ్ టెక్నాలజీ ఈ ఆఫ్-రోడ్ రాక్షసుడి ప్రధాన బలంగా నిలవనుంది.
లాంచ్ వివరాలు
ప్రస్తుతం చివరి దశ టెస్టింగ్ జరుపుకుంటున్న ఈ 2026 మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ త్వరలోనే అధికారికంగా లాంచ్ కానుంది. ఇప్పటికే ఉన్న థార్ మోడల్‌కు ఇది మరింత ఆధునిక రూపాన్ని తీసుకురానుండటంతో యువత నుంచి దీనికి భారీ స్పందన లభించే అవకాశం ఉంది.

