Maruti Brezza : విప్లవాత్మక టెక్నాలజీతో వస్తున్న 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్.. ధర వింటే కస్టమర్లు ఫిదా
ధర వింటే కస్టమర్లు ఫిదా

Maruti Brezza : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజ్జా సరికొత్త లుక్‌లో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై ముమ్మరంగా టెస్టింగ్ జరుపుకుంటోంది. ఈ టెస్ట్ మోడల్స్ ద్వారా కారులో రాబోయే పలు మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు లీకయ్యాయి. ఈసారి మారుతి సుజుకి కేవలం కాస్మెటిక్ మార్పులు మాత్రమే కాకుండా.. సరికొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్, అదిరిపోయే అండర్‌బాడీ సీఎన్‌జీ టెక్నాలజీ,పెద్ద డిస్‌ప్లే స్క్రీన్ వంటి భారీ మార్పులతో కస్టమర్ల ముందుకు రాబోతోంది.
ఫ్రాంక్స్ లాంటి టర్బో పవర్
కొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో మారుతి సుజుకి తన పాపులర్ 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేయబోతోంది. ప్రస్తుతం మారుతి ఫ్రాంక్స్ కారులో వాడుతున్న 3-సిలిండర్ ఇంజిన్ ఇదే. ఇది దాదాపు 100PS పవర్‌ను, 148Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి తోడు కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా రానుంది. ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే.. పాత 1.5 లీటర్ ఇంజిన్‌తో పోలిస్తే ఈ చిన్న 1.0 లీటర్ టర్బో ఇంజిన్ తక్కువ పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ కొత్త టర్బో వెర్షన్ కేవలం 18 శాతం జీఎస్‌టీ కేటగిరీలోకి వచ్చే అవకాశం ఉండటంతో, కారు ధరను కంపెనీ చాలా ఆకర్షణీయంగా, తక్కువ బడ్జెట్‌లోనే అందుబాటులోకి తెచ్చే స్కెచ్ వేసింది.
సీఎన్‌జీ మోడల్‌లో అండర్‌బాడీ ట్యాంక్ మాయాజాలం
సీఎన్‌జీ కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి ఒక బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. సాధారణంగా సీఎన్‌జీ కార్లలో గ్యాస్ సిలిండర్ వెనుక డిక్కీలో ఉండటం వల్ల సామాన్లు పెట్టుకోవడానికి అస్సలు స్థలం ఉండదు. కానీ, 2026 బ్రెజ్జా సీఎన్‌జీ వేరియంట్‌లో సరికొత్త అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్ టెక్నాలజీని తీసుకురానున్నారు. అంటే సిలిండర్ కారు అడుగు భాగానికి వెళ్తుంది. దీనివల్ల డిక్కీ స్పేస్ పూర్తిగా ఖాళీగా దొరుకుతుంది, ఎంత లగేజీ అయినా హ్యాపీగా సర్దేసుకోవచ్చు. ఈ మోడల్‌తో పాటు పాత 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా యథావిధిగా కొనసాగుతుంది.
ప్రీమియం కేబిన్ ఫీచర్లు..
కారు లోపలి భాగాన్ని కూడా చాలా లగ్జరీగా డిజైన్ చేస్తున్నారు. ఇందులో సరికొత్త 10.1-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చనున్నారు. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో వస్తుంది. అలాగే సరికొత్త సీట్ ఫ్యాబ్రిక్, నయా డ్యాష్‌బోర్డ్ ట్రిమ్స్, ఆకర్షణీయమైన కేబిన్ థీమ్‌ను ఇవ్వబోతున్నారు. ఎక్స్‌టీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, సరికొత్త డిజైన్ గల అల్లాయ్ వీల్స్ రానున్నాయి. ఈ నయా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ను 2026 పండగ సీజన్ (దసరా-దీపావళి) నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది. మార్పులు తక్కువగానే ఉండటం వల్ల ప్రస్తుత ధర (రూ. 8.26 లక్షల నుంచి రూ. 12.86 లక్షలు ఎక్స్-షోరూమ్) కంటే కొద్దిగా మాత్రమే రేట్లు పెరగొచ్చు.

