Skoda Kodiaq : స్కోడా కొడియాక్ ఊచకోత.. ఇక లగ్జరీ కార్లన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే
ఇక లగ్జరీ కార్లన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే

Skoda Kodiaq : ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో తన పాపులర్ ఎస్‌యూవీ కొడియాక్‌ను 2026 మోడల్‌గా సరికొత్త హంగులతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈసారి డిజైన్ పరంగా భారీ మార్పులు చేయనప్పటికీ, టెక్నాలజీ, సేఫ్టీ విషయంలో మాత్రం ఈ కారును నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ప్యాకేజీతో వస్తున్న ఈ కారు, ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సిద్ధమైంది. లగ్జరీ,భద్రతను కోరుకునే వారికి ఈ 2026 మోడల్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
2026 స్కోడా కొడియాక్‌లో ప్రధాన ఆకర్షణ దీని అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ప్యాకేజీ. ఇందులో లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా చేరిన టర్న్ అసిస్ట్, క్రాస్‌రోడ్ అసిస్ట్ జంక్షన్ల వద్ద ప్రమాదాలు జరగకుండా డ్రైవర్‌ను హెచ్చరిస్తాయి. అలాగే కారు డోర్ తీసే సమయంలో వెనుక నుంచి వచ్చే వాహనాలను గుర్తించి ప్రయాణికులను అలర్ట్ చేసే ఎగ్జిట్ వార్నింగ్ ఫీచర్ ఇందులో ఉండటం విశేషం.
కారు లోపలి భాగంలో కస్టమర్లకు ఒక లగ్జరీ అనుభూతి కలుగుతుంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు మరింత వేగవంతంగా పని చేస్తాయి. స్పోర్ట్‌లైన్, ఎల్‌అండ్‌కే వేరియంట్లలో ఇప్పుడు 360-డిగ్రీల కెమెరా, గ్రిల్‌లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ స్ట్రిప్ వంటి ఫీచర్లను అందించారు. గతంలో ఇవి కేవలం టాప్-ఎండ్ మోడల్స్‌కే పరిమితం కాగా, ఇప్పుడు మిడ్-రేంజ్ వేరియంట్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, 2026 కొడియాక్‌లో పాత నమ్మకమైన 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 204 హార్స్‌పవర్, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (DSG) జత చేయబడింది. ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఈ పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది, దీనివల్ల ఆఫ్-రోడింగ్ మరియు హైవే డ్రైవింగ్‌లో ఈ కారు అద్భుతమైన గ్రిప్‌ను అందిస్తుంది.
భారత మార్కెట్లో ADAS ఫీచర్ కలిగి ఉన్న ఏకైక స్కోడా కారు కొడియాక్ కావడం విశేషం. ఇది నేరుగా వోక్స్‌వ్యాగన్ టైరోన్, ఇతర ప్రీమియం ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ, హిల్-డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు కొడియాక్‌ను ఫ్యామిలీ సేఫ్టీ ఎస్‌యూవీగా నిలబెట్టాయి. మార్కెట్లో ఇప్పటికే మంచి క్రేజ్ ఉన్న కొడియాక్, ఈ కొత్త అప్‌డేట్స్‌తో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

