Skoda Slavia: కొత్త లుక్‌తో 2026 స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్.. ఈ మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు చూశారా?
ఈ మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు చూశారా?

Skoda Slavia: ఎస్ యూవీల జోరు పెరుగుతున్న వేళ సెడాన్ ప్రేమికులకు స్కోడా అదిరిపోయే శుభవార్త చెప్పింది. అత్యంత ఆకర్షణీయమైన డిజైన్, సరికొత్త సాంకేతికతతో 2026 స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌ను షోకేస్ చేసింది. ఈ విభాగంలోనే తొలిసారిగా వెనుక సీట్లలో మసాజ్ ఫంక్షన్ సహా అద్భుతమైన భద్రతా ఫీచర్లను ఇందులో పరిచయం చేశారు. స్కోడా సంస్థ తన సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో స్పష్టంగా ప్రదర్శించింది. ముందు భాగంలో గ్రిల్‌తో ఎంతో సున్నితంగా అనుసంధానించిన ఎల్ఈడి డిఆర్ఎల్స్ కారుకు ప్రీమియం లుక్‌ను తెచ్చిపెట్టాయి. రాత్రి వేళల్లో మెరుగైన కాంతినిచ్చే స్లీక్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్, ఎల్ఈడి ఫాగ్ లాంప్స్ ముందు వైపు రూపురేఖలను పూర్తిగా మార్చేశాయి. పక్క భాగంలో కొత్తగా అందించిన 16-ఇంచుల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కారుకు మంచి స్పోర్టీ అప్పీల్‌ను ఇస్తున్నాయి. వెనుక భాగంలో టెయిల్ లాంప్స్ పక్కనే స్కోడా బ్రాండింగ్‌ను అమర్చి, వెనుక బంపర్‌ను టెక్స్చర్డ్ ఫినిషింగ్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆర్కిటిక్ సిల్వర్ సహా మొత్తం 10 రంగుల ఆప్షన్లు ఇందులో లభిస్తాయి.
సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా రేర్ మసాజ్ సీట్లు
కారు కేబిన్ లోపలికి అడుగుపెడితే టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీజ్ ఇంటీరియర్ థీమ్ కళ్లను ఆకట్టుకుంటాయి. ఈ కొత్త మోడల్‌లో 10.1-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది గూగుల్ క్లౌడ్ ఆధారిత ఏఐ అసిస్టెంట్‌తో పనిచేస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ చార్జింగ్, పవర్డ్ వెంటలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఈ కారు ప్రత్యేకతలు. అన్నింటికంటే ముఖ్యం ఈ కేటగిరీలోనే తొలిసారిగా వెనుక సీట్లలో మసాజింగ్ ఫంక్షన్ అందించడం ప్రయాణికులకు లగ్జరీని ఇస్తుంది.
అతుకులు లేని ప్రయాణానికి కొత్త గేర్‌బాక్స్
ఇంజన్ విషయానికి వస్తే ఇదివరకు ఉన్న 1.0-లీటర్ టిఎస్ఐ, 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఆప్షన్లనే కొనసాగించారు. అయితే 1.0-లీటర్ ఇంజన్‌తో వస్తున్న ఆటోమేటిక్ వేరియంట్‌లో పాత 6-స్పీడ్ టాార్క్ కన్వర్టర్ స్థానంలో సరికొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం విశేషం. ఇది గేర్ షిఫ్టింగ్‌ను చాలా వేగంగా, స్మూత్‌గా మారుస్తుంది. పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం 1.5-లీటర్ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్జీ గేర్‌బాక్స్ కాంబినేషన్‌తో అందుబాటులో ఉంది.
సేఫ్టీలో 5-స్టార్ భరోసా
గ్లోబల్ ఎన్‌సిఎపి క్ర్యాష్ టెస్ట్‌లో ఇప్పటికే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన స్లావియా, కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో మరింత సురక్షితంగా మారింది. ఇరుకైన ప్రదేశాల్లో కారును సులువుగా పార్కింగ్ చేయడానికి కొత్తగా 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను చేర్చారు. వీటితో పాటు స్టాండర్డుగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు లభిస్తాయి.

