ఇప్పుడు మరింత పవర్ఫుల్

Maruti Ertiga : కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడానికి మంచి కారుకోసం చూస్తున్నారా.. అప్పుడు వెంటనే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేరు మారుతి సుజుకి ఎర్టిగా. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అప్‌డేట్ చేస్తూ భారత మార్కెట్‌లో ఎర్టిగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇప్పుడు మారుతి సుజుకి ఈ ఎంపీవీని మరింత మెరుగ్గా మార్చి మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కొత్త ఫీచర్లు, చిన్నపాటి డిజైన్ మార్పులతో ఈ కారు ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఉంది.

ధర, డిజైన్, ఫీచర్స్ లో మార్పులు

కొత్త మారుతి సుజుకి ఎర్టిగాలో కొన్ని కీలక మార్పులు చేశారు. ఇది వరకు రూఫ్‌పై ఉండే ఏసీ వెంట్స్‌ను ఇప్పుడు మధ్య కన్సోల్ వెనుక భాగంలో అమర్చారు. దీని వల్ల కంపెనీకి ఉత్పత్తి ఖర్చు కొంత తగ్గుతుంది. కారు ప్రారంభ ధర రూ.9.11 లక్షలు. డిజైన్ పరంగా చూస్తే, వెనుక భాగంలో కొత్త రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌ని పెట్టారు. ఇది కారుకు మరింత స్టైలిష్ లుక్‌ని ఇస్తుంది. అలాగే, అప్‌డేటెడ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త టెయిల్ గేట్, రియర్ క్వార్టర్ ప్యానెల్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే, ముందు గ్రిల్, లైటింగ్ సెటప్ మాత్రం పాత మోడల్‌లో ఉన్నట్టే ఉన్నాయి.

అదనపు ఫీచర్లు, సౌకర్యాలు

ఈ కొత్త ఎర్టిగాలో థర్డ్ లేన్లో కూర్చునే వారికి కూడా బ్లోవర్ కంట్రోల్‌తో పాటు స్పెషల్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇక అన్ని వరుసల వారికి అనువుగా నాలుగు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు కూడా జోడించారు. ఈ చిన్నపాటి మార్పులు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి.

భద్రతకు పెద్దపీట

కొత్త ఎర్టిగాలో అత్యంత ముఖ్యమైన మార్పు సేఫ్టీ ఫీచర్ల విషయంలో కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డుగా లభిస్తాయి. పాత మోడల్‌లో మధ్య సీటుకు కేవలం ల్యాప్ బెల్ట్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఈ మార్పు ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పిస్తుంది.

ఇంజిన్, మైలేజ్

ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత 1.5-లీటర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్‌లు యథావిధిగా ఉన్నాయి. పెట్రోల్ మోడల్ 20.51 కిలోమీటర్లు, సీఎన్‌జీ మోడల్ దాదాపు 26.11 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తాయి. పెట్రోల్ తో పోలిస్తే, సీఎన్‌జీ మోడల్ చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story