త్వరలో మార్కెట్లోకి 7 ఎస్యూవీలు

Hybrid SUVs : దేశంలోని చాలా పాపులర్ పెట్రోల్, డీజిల్ ఎస్‌యూవీలు, కార్లు హైబ్రిడ్ వెర్షన్‌లుగా మారనున్నాయి. ఈ మార్పులో మారుతి సుజుకి కూడా భాగస్వామిగా ఉంది. మారుతి సుజుకి 2026లో తమ ఫ్రాంక్స్ కాంపాక్ట్ క్రాస్‌ఓవర్, న్యూ జనరేషన్ బాలెనో హ్యాచ్‌బ్యాక్ లలో దేశీయంగా అభివృద్ధి చేసిన పవర్ఫుల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. మహీంద్రా కంపెనీకి చెందిన ప్రముఖ XUV 3XO కూడా వచ్చే ఏడాది హైబ్రిడ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది.

మహీంద్రా కొత్త NU_IQ ప్లాట్‌ఫారమ్

మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్ కోసం అద్భుతమైన వ్యూహాన్ని కలిగి ఉంది. వాహన తయారీ సంస్థ ఇటీవల తన సరికొత్త NU_IQ ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేసింది. ఇది హైబ్రిడ్‌తో సహా అనేక పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. దీని అర్థం NU-IQ ఆర్కిటెక్చర్ ఆధారంగా భవిష్యత్ మహీంద్రా ఎస్‌యూవీలను హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో పరిచయం చేయవచ్చు. మహీంద్రా XUV 3XO కంపెనీ మొదటి హైబ్రిడ్ అవుతుంది. ఇది 2026లో వస్తుంది. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ హైబ్రిడ్ సెటప్‌తో జతచేయబడే అవకాశం ఉంది.

హోండా, మారుతి సుజుకి హైబ్రిడ్ ప్లాన్స్

హోండా ఎలివేట్ హైబ్రిడ్: హోండా మొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీ ఉత్పత్తి త్వరలో రాజస్థాన్‌లోని అల్వార్‌లోని కంపెనీ తపుకారా ప్లాంట్‌లో ప్రారంభమవుతుంది. అయితే, ఇది 2026 సెకండాఫ్‎లో మార్కెట్‌లోకి వస్తుందని అంచనా. హోండా ఎలివేట్ హైబ్రిడ్ కోసం సిటీ ఇ:హెచ్‌ఈవీ అట్కిన్సన్ సైకిల్ 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించవచ్చు.

మారుతి ఫ్రాంక్స్, బాలెనో: 2025లో మారుతి ఫ్రాంక్స్ బ్రాండ్ సరికొత్త, దేశీయంగా అభివృద్ధి చేసిన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను పరిచయం చేస్తుంది. ఇది 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ నెక్ట్స్ జనరేషన్ బాలెనోలో కూడా ఉపయోగించనున్నారు. దీనిని 2026లో విడుదల చేయాలి.

రెనాల్ట్, హ్యుందాయ్, కియా హైబ్రిడ్ కార్లు

రెనాల్ట్ డస్టర్: థర్డ్ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ పెట్రోల్ ఇంజిన్‌తో 2026 ప్రారంభంలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. దీని హైబ్రిడ్ వేరియంట్ 6 నుండి 12 నెలల తర్వాత (2027 ప్రారంభంలో) వస్తుంది.

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్: భారతదేశంలోని ప్రముఖ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ 2027లో తమ న్యూ జనరేషన్ వెర్షన్లు కూడా హైబ్రిడ్ వెర్షన్లుగా మారతాయి. రెండు ఎస్‌యూవీలు హైబ్రిడైజ్డ్ 1.5L, 4-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్‌తో వస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story